అబార్షన్‌‌లపై నిషేధం విధించడాన్ని తప్పుపట్టిన ప్రియాంక.. దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ

దిశ, సినిమా : అమెరికాలో అబార్షన్ హక్కులపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా స్పందించింది..Latest Telugu News

Update: 2022-06-26 07:49 GMT

దిశ, సినిమా : అమెరికాలో అబార్షన్ హక్కులపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా స్పందించింది. రాజ్యాంగ పరిరక్షణకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే ఈ ఇష్యూపై అగ్రరాజ్యంలో 50 రాష్ట్రాల్లో మహిళలు నిరసనకు దిగిన నేఫథ్యంలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైన ప్రియాంక.. మాజీ అధ్యక్షుడి ఒబామా సతీమణి మిచెల్ ఒబామా చేసిన ప్రకటనను మళ్లీ నెట్టింట రీ పోస్ట్ చేసింది. ఈ మేరకు హృదయ విదారకమైన ఈ తీర్పు టీనేజ్ అమ్మాయిల చదువు, జీవితాన్ని నాశనం చేస్తుందని.. తమ పిల్లల భవిష్యత్తు కళ్ల ముందే ఆవిరైపోతుండటం చూసి తల్లిదండ్రులు ఎలా తట్టుకుంటారని బాధపడింది. నేటి తరం ఆడపిల్లలు సొంత జీవితం కోరుకుంటున్నట్లు తెలిపిన ఆమె.. ఇందుకు విరుద్ధంగా వచ్చిన భయానకమైన తీర్పుతో సమాజానికి భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.  


Similar News