వింత సంఘటన... మహిళలు తాకితే స్పృహ తప్పి పడిపోతున్న పూజారి
దిశ, వెబ్ డెస్క్: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న పూజారిని...priest faints as soon as he touches the women the doctor told the psychopath
దిశ, వెబ్ డెస్క్: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న పూజారిని మహిళలు తాకితే స్పృహ తప్పి పడిపోతున్నాడు. దీంతో అతను ఆలయానికి వచ్చిన మహిళలను దగ్గరికి రానివ్వడంలేదు.. తెగ భయపడిపోతున్నాడు. దీంతో అతను దూరం నుంచే హారతి ఇస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని టెస్ట్ చేసిన వైద్యుడు వాస్తవమేమిటో చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న ఓ దేవాలయంలోని పూజారిని మహిళలు తాకితే చాలు స్పృహ తప్పి పడిపోతున్నాడు. తాను ఆంజనేయుడిని విపరీతంగా ఆరాదిస్తానని... అందుకే ఇలా జరుగుతుందని ఆ పూజారి చెప్పుకొచ్చాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయి అతడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే, అతను ఆ పూజారిని అన్ని విధాలుగా టెస్ట్ చేశాడు. కానీ రిపోర్ట్స్ లలో నార్మల్ అనే వచ్చింది. దీంతో ఆ డాక్టర్ కూడా సుధీర్ఘంగా ఆలోచించాడు. అనంతరం ఆ పూజారికి ఓ టెస్ట్ పెట్టాడు. లేడీ నర్సు నిన్ను తాకుతుంది.. నువ్వు స్పృహ కోల్పోతావో లేదో మేం చూస్తాం అని ఆ పూజారికి చెబుతాడు. అయితే, అతడిని మాత్రం లేడీ నర్సుతో కాకుండా అక్కడే పని చేస్తున్న ఓ వ్యక్తిని తాకమని చెబుతాడు డాక్టర్. అయితే, ఆ పూజారి అతడు తాకిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. పూజారి తిరిగి తేరుకున్నాక డాక్టర్ జరిగినదంతా చెప్పాడు. వెంటనే అతను మానసిక రుగ్నతతో బాధపడుతున్నట్లు గుర్తించి అతడికి చికిత్స ప్రారంభించాడు.