వేలాది ఏళ్ల క్రితం చనిపోయిన తాబేలు.. గర్భంలో ఇంకా పదిలంగా ఉన్న గుడ్డు!
దిశ, ఫీచర్స్ : దక్షిణ ఐరోపాలోని పాంపెయ్ ప్రాంతంలో క్రీ.శ.62కు చెందిన తాబేలు అవశేషాలు కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : దక్షిణ ఐరోపాలోని పాంపెయ్ ప్రాంతంలో క్రీ.శ.62కు చెందిన తాబేలు అవశేషాలు కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. అగ్నిపర్వత విస్ఫోటన కారణంగా ధ్వంసమైన ఇంటి శిథిలాల్లో గర్భంతో ఉన్న ఈ తాబేలును గుర్తించగా.. ఇప్పటికీ ఆ గుడ్డు పదిలంగా ఉండటం విశేషం.
2000 ఏళ్ల క్రితం వెసువియాస్ అగ్నిపర్వతం బద్ధలు కాగా పాంపెయ్‌కి చెందిన ప్రజలు, వృక్ష, జీవ జాతితో పాటు ఆ ప్రాంతమంతా బూడిదలో కలిసిపోయింది. అయితే ఈ విస్ఫోటనానికి ముందు ఆ ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. దీంతో గర్భిణీగా ఉన్న ఓ తాబేలు గుడ్డు పెట్టేందుకు సురక్షితమైన ప్రదేశాన్ని వెతుక్కుంటుండగా అప్పటికే ధ్వంసమైన ఒక భవనం కింద తలదాచుకుంది. దురదృష్టవశాత్తూ ఆ ప్రాంతంలోనే అగ్నిపర్వత విస్పోటనం సంభవించడంతో ప్రాణాలు విడిచింది. పురావస్తు శాస్త్రవేత్తలు
ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టగా, ఈ తాబేలుకు చెందిన అవశేషాలు లభ్యం కాగా ఇప్పటికీ దాని కడుపులో గుడ్డు అలాగే ఉండటం విశేషం. 14సెంటీమీటర్ల పొడవైన ఈ తాబేలు (5.5అంగుళాల పొడవు) హెర్మాన్ జాతికి చెందినదిగా గుర్తించారు.
అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్త మార్క్ రాబిన్సన్, 2002లో పాంపెయ్ సమీప ప్రాంతంలోనే మరో తాబేలు అవశేషాలను కనుగొన్నారు. ఇక పాంపెయ్ పురావస్తు ప్రదేశంలో బెర్లిన్‌లోని ఫ్రీ యూనివర్శిటీ సహా నేపుల్స్ యూనివర్శిటీకి చెందిన ఎల్ ఓరియంటేల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలు కూడా తవ్వకాలు జరుపుతున్నాయి.
పాంపెయ్‌లో భూకంపం తర్వాత అనేక నివాసగృహాలు నేలమట్టమయ్యాయి. నగరమంతా ధ్వంసమైంది. అక్కడి జీవజాలమంతా అతాలాకుతలమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నిరుపయోగంగా, నిర్మాణుష్యంగా మారడంతో అడవి జంతువులు సంచరించించి ఉంటాయి. ఈ క్రమంలోనే సమీప గ్రామీణ ప్రాంతాల నుంచి తాబేలు సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుంటూ ఆ భవనానికి వచ్చి ఉండొచ్చు. లేదా అది పెంపుడు తాబేలు అయి ఉండొచ్చు. ఏదేమైనా అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఆ నగరం పూర్తిగా నాశనమైంది, గుడ్డును పెట్టేందుకు సురక్షితమైన స్థలాన్ని కనుగొనేలోపు ఆ తాబేలు కూడా చనిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుత తవ్వకాలు పాంపెయ్ పట్టణ కేంద్రం వెలుపల కనిపించే సేంద్రీయ, వ్యవసాయ పద్ధతులకు సంబంధించినది. తాజా ఆవిష్కరణతో భూకంపం తర్వాతి కాలంలో పాంపెయ్ సహజ పర్యావరణ వ్యవస్థ గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశముంది.
- గాబ్రియేల్ జుచ్‌ట్రిగెల్ , పాంపెయ్ డైరెక్టర్ జనరల్