Prabhas: చావు దెబ్బ తీశావ్ కదా.. ప్రభాస్ ‘రాజాసాబ్’ లుక్‌పై నెట్టింట దారుణమైన ట్రోల్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి. రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతీ (Maruti) దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదే జోష్‌లో తాజాగా ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ మోషన్ పోస్టర్ (Motion Poster) రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే.. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియా (Social Media)లో విశేష స్పందన లభించినప్పటికీ.. ట్రోల్స్ (Trolls) కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే.. ప్రభాస్ మోషన్ పోస్టర్లో వేసుకున్న షర్ట్ (shirt) ఇప్పటికే ‘విశ్వం’లో గోపీ చంద్ (Gopi Chand), ‘బంగార్రాజు’లో నాగచైతన్య (Naga Chaitanya) సేమ్ కాస్ట్యూమ్ (costume) ధరించారు. దీంతో.. ప్రభాస్ తాజా లుక్‌ను గోపీ చంద్, నాగచైతన్య ఫొటోలతో పోల్చుతూ.. చావు దెబ్బ తీశావ్ కదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు X వేదికగా ట్రెండ్ అవుతున్నాయి.
Read More ..
Prabhas: విలన్‌గా ప్రభాస్.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో