Bundelkhand ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించనున్న Modi

PM Modi to Inaugurate Bundelkhand Expressway On July 16| బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను రేపు(శనివారం) దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ హైవేను లక్నో-ఆగ్రా అనుసంధానం అయ్యేలా నిర్మించారు

Update: 2022-07-15 11:51 GMT

లక్నో: PM Modi to Inaugurate Bundelkhand Expressway On July 16| బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను రేపు(శనివారం) దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ హైవేను లక్నో-ఆగ్రా అనుసంధానం అయ్యేలా నిర్మించారు. దాదాపు రూ.14,850 కోట్ల వ్యయంతో 296 కిలో మీటర్ల పొడవైన రోడ్డును యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్మించింది. అయితే గతంలో ఈ రోడ్డుకు నాలుగు లేన్‌లు మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం దాన్ని ఆరు లేన్లుగా విస్తరించినట్లు అధికారులు చెప్పారు.

ఈ హైవే ఉత్తర ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా వెళ్తుంది. బుందేల్‌ఖండ్‌లోని చిత్రకూట్ జిల్లా భరత్‌కూట్ సమీపంలోని గోండా గ్రామం వద్ద ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) సహకారంతో యూపీ ప్రభుత్వం 28 నెలల్లో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసింది. ప్రతి 500 మీటర్ల దూరంలో వర్షపు నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంది. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఏడు లక్షల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.15 వేల కోట్లు.. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ టెండరింగ్‌ను ఎంచుకోవడంతో దాదాపు రూ.1,132 కోట్లు ఆదా అయినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: 33 ప్రభుత్వ పాఠశాలల్లో దర్యాప్తు.. అలా ఎలా చేశారని..

Tags:    

Similar News