Jio Unlimited 5G Voucher: జియో కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 601తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5జీ..!
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ, ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ జియో(Reliance Jio) తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ, ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ జియో(Reliance Jio) తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జియో తమ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 601తో 'అన్‌లిమిటెడ్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్(Unlimited 5G Upgrade Voucher)'ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ వోచర్ తో కస్టమర్లు సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను వినిగించుకోవచ్చని తెలిపింది. అలాగే ఈ వోచర్ సహాయంతో 4జీ వినియోగదారులు కూడా 5జీ అపరిమిత సేవలను పొందొచ్చని పేర్కొంది. దీన్ని మై జియో అప్లికేషన్(My Jio App)లో కొనుగోలు చేసి అందులోనే యాక్టివేట్ చేసుకోవాలని, కావాలంటే ఈ వోచర్ ను ఫ్రెండ్స్(Friends)కి గిఫ్ట్(Gift)లా కూడా పంపుకోవచ్చని వెల్లడించింది.
కాగా రిలయన్స్ జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు 5G మొబైల్ ఉన్న కస్టమర్లకు ఫ్రీగా అపరిమిత డేటాను అందించింది. రూ. 239 కంటే ఎక్కువ రీచార్జి చేసుకున్న వారికీ ఈ సదుపాయం కల్పించింది. అయితే జులైలో టెలికాం సంస్థలు(Telecom companies) రీచార్జి ప్లాన్ల రేట్లను పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జియో కూడా టారీఫ్ రేట్లను పెంచి 5జీ డేటాకు రిస్ట్రిక్షన్స్ విధించింది. ప్రస్తుతం నెలకు రూ. 349 ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ రీచార్జి చేసుకున్న వారికీ మాత్రమే ఫ్రీగా 5జీ అన్‌లిమిటెడ్ డేటా అందిస్తోంది. అయితే తక్కువ రీచార్జి ప్లాన్ వేసుకున్న వారికీ 5జీ సర్వీసెస్ ను అందించేందుకు ఇటీవలే రూ. 51, రూ. 101, రూ. 151తో బూస్టర్ ప్లాన్లను జియో ప్రవేశ పెట్టింది. తాజాగా ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందించేందుకు రూ. 601తో కొత్త వోచర్ తీసుకొచ్చింది.