19న గుజరాత్‌కు ప్రధాని! 2 నెలల్లో రెండు సార్లు పర్యటన
గాంధీనగర్: ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో పర్యటించనున్నారు..telugu latest news
గాంధీనగర్: ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 19 నుంచి రెండు రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పర్యటన విశేషాలను మాత్రం వెల్లడించలేదు. గత రెండు నెలల్లో మోడీ రెండోసారి పర్యటించడం గమనార్హం. గత పర్యటనలో గిరిజన ప్రాంతమైన దాహోద్ లో పర్యటిస్తానని ఆయన తెలిపారు. మరోవైపు తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో గెలుపొందిన జోరులో బీజేపీ ఉంది. ఇదే ఊపులో గుజరాత్‌లోనూ తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 1995లో గుజరాత్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటినుంచి అధికారంలోనే కొనసాగుతుంది. మరోవైపు ఆమ్ ఆద్మీపార్టీ కూడా రాష్ట్రంలో తమ ముద్ర వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మధ్యనే పార్టీ అంతర్గత సర్వేలో గుజరాత్ లో 58 సీట్లు గెలుస్తామని ఆప్ రాష్ట్ర ఇంఛార్జ్ సందీప్ పఠాక్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.