అట్లాంటిక్ పైన‌ మేఘాల్లో మిస్టీరియస్‌గా ఎర్ర‌ని కాంతి.. అవాక్కైన పైలెట్! (వీడియో)

ఏలియ‌న్లు భూమిని చేరారంటూ ఊహాగానాల‌కు ప‌దును పెట్టారు. Mysterious Red Glow In Clouds Over Atlantic Ocean.

Update: 2022-07-28 09:43 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః అట్లాంటిక్ మహాసముద్రం పైన విమానాన్ని న‌డుపుతున్న పైలట్‌కు ఒక వింతైన దృశ్యం క‌నిపించింది. మేఘాలపైన మిస్టీరియ‌స్‌గా ఎర్రటి కాంతిని చూసాడు. ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని ఈ దృశ్యాన్ని పైలెట్ వీడియోలో బంధించాడు. ఇప్పుడ‌ది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ స్పూకీ వీడియో గత శుక్రవారం క్యాప్చ‌ర్ చేయ‌గా, ఇంట‌ర్నెట్‌లో తీవ్ర‌మైన చ‌ర్చ‌కు దారితీసింది. రెడిట్‌లో ఈ ఫోటోలు చూసిన నెటిజ‌నులు ఇక ప్ర‌పంచ అంతం స‌మీపించిందంటూ కామెంట్లు చేయ‌గా, కొంద‌రు, ఏలియ‌న్లు భూమిని చేరారంటూ ఊహాగానాల‌కు ప‌దును పెట్టారు. అయితే, ఈ వీడియో తీసిన పైలెట్‌కు సంబంధించిన వివ‌రాలు గానీ, అత‌డు అట్లాంటిక్ స‌ముద్రం మీదుగా ఎందుకు వెళ్లాడు అనే వివరాలు లేవు.

అయితే కొంతమంది సోష‌ల్ మీడియా వినియోగదారులు ఈ రెడ్ గ్లో స్పాట్స్ గురించి త‌మ‌కు తెలిసిన వివ‌రాను పంచుకున్నారు. అట్లాంటిక్ స‌ముద్రంలో చేపలను ఆకర్షించడానికి ఎరుపు కాంతిని ఉపయోగించే ఒక ఫిషింగ్ బోట్ ఉంటుంద‌ని అన్నారు. "ఇది సౌరీ అనే చేప‌ని ఆకర్షించడానికి వాడే శ‌క్తివంత‌మైన‌ ఎరుపు లైట్లు. వాటిని ఉపయోగించి చేపలు పట్టే ఓడలు నుండి వ‌చ్చిన‌ కాంతి మేఘాల్లో ప‌డి, మేఘాల పైన అలా క‌నిపించింద‌ని అన్నారు. అయితే, సాంప్రదాయకంగా పసిఫిక్ మహాసముద్రంలో ఆచరించే సౌరీ ఫిషింగ్‌లో చేపలను ఆకర్షించడానికి భారీ LED లైట్లను వినియోగిస్తార‌ని తెలుస్తుంది. మొత్తానికి, పైలెట్‌కు క‌నిపించిన ఈ లైట్లు నెటిజ‌నుల‌ను కంగారు పెట్టాయి. మీరూ చూడండి!


Similar News