పురుషాంగం ఆకారంలో లాకెట్.. ఆ చక్రవర్తిదే?

దిశ, ఫీచర్స్ : యూకేకు చెందిన ఒక మెటల్ డిటెక్టరిస్ట్.. పురుషాంగం ఆకారంలో ఉన్న రోమన్ యుగం నాటి అరుదైన వెండి లాకెట్‌ను గుర్తించింది.

Update: 2022-07-23 13:16 GMT

దిశ, ఫీచర్స్ : యూకేకు చెందిన ఒక మెటల్ డిటెక్టరిస్ట్.. పురుషాంగం ఆకారంలో ఉన్న రోమన్ యుగం నాటి అరుదైన వెండి లాకెట్‌ను గుర్తించింది. 2020 న్యూ ఇయర్ సందర్భంగా హైయామ్‌ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఒక రిటైర్డ్ ఎస్టేట్ ఏజెంట్ Ms థాంప్సన్‌కు ఈ పెండెంట్‌ లభించింది. అతను తన పొలాన్ని మెటల్ డిటెక్టర్‌తో పరిశీలిస్తున్నపుడు నేలకు ఎనిమిది అంగుళాల దిగువన ఈ వస్తువు దొరికినట్లు తెలిసింది.

మే 26న మైడ్‌స్టోన్‌లోని కౌంటీ హాల్‌లో నిర్వహించిన విచారణ ఆధారంగా.. 1.2-అంగుళాల పొడవైన ఈ లాకెట్‌ను వెండితో తయారు చేసినట్లు తేలింది. అంతేకాదు 43AD, 410AD కాలానికి చెందినదిగా కనుగొనబడిన ఈ పెండెంట్‌ ఒక నిధిగా పరిగణించబడింది. కాగా శవ పరీక్ష నిర్వహించే అధికారి(Coroner) రోజర్ హాచ్.. లాకెట్‌పై రూపొందించిన ఫోర్ స్కిన్, షాఫ్ట్, ప్యూబిక్ హెయిర్ గురించి వివరించాడు. అయితే బ్రిటిష్ మ్యూజియం రిపోర్ట్ దీనిక సంబంధించిన ఖచ్చితమైన టైమ్‌లైన్‌ను చెప్పలేకపోయింది. కానీ లాకెట్ ఫాలిక్(స్తంభించిన అంగం) నేచర్ ఆధారంగా ఇది రోమన్ యుగానికి చెందినదని తెలుస్తోంది.

రోమన్ బ్రిటన్ నుంచి దాదాపు 451 రికార్డ్ చేయబడిన ఫాలిక్ వస్తువులు ఉన్నాయి. సాధారణంగా రోమన్ కళ.. పురుషత్వానికి చిహ్నమైన పురుషాంగ శక్తిని చూపే ఫాలిక్ చిత్రాల వ్యక్తీకరణకు ప్రసిద్ధి. యుద్ధంలో అదృష్టం కోసం సైనికులు తరచుగా పిడికిలి లేదా ఫాలస్ ఆకారపు తాయత్తులను ధరించేవారు. అంతేకాదు చెడు దృష్టిని నివారించేందుకు పిల్లలకు కూడా అలాంటి పెండెంట్‌లు ఇచ్చేవారు.

మెటల్ డిటెక్టరిస్ట్‌లు చట్ట ప్రకారం తమ అన్వేషణలను గుర్తించిన 14 రోజుల్లోగా నివేదించాలి. సాధారణ పద్ధతి ప్రకారం దీని వాల్యుయేషన్ చేసి, విక్రయించిన తర్వాత ఆ డబ్బు.. డిటెక్టరిస్ట్, భూ యజమానికి షేర్ చేయబడుతుంది.

Tags:    

Similar News