Mohammed Zubair: మహ్మద్ జుబైర్ కి 14రోజుల జ్యుడిషీయల్ కస్టడీ
Patiala Court Refuses Mohammed Zubair's Bail Plea| ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ కు నిరాశే ఎదురైంది. అభ్యంతర కేసులో అరెస్టైన జుబైర్ కోర్టును బెయిల్ మంజూరు చేయాలని కోరగా, శనివారం పాటియాలా న్యాయస్థానం అందుకు నిరాకరించింది.
న్యూఢిల్లీ: Patiala Court Refuses Mohammed Zubair's Bail Plea| ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ కు నిరాశే ఎదురైంది. అభ్యంతర కేసులో అరెస్టైన జుబైర్ కోర్టును బెయిల్ మంజూరు చేయాలని కోరగా, శనివారం పాటియాలా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు జరిగిన విచారణలో జుబైర్ సినిమాకు సంబంధించిన ట్వీట్ చేశారని న్యాయవాది వ్రిందా గ్రోవర్ తెలిపారు. అంతేకాకుండా ఫోన్ ను ఫార్మాట్ చేయడం చట్టవిరుద్ధం కాదని పేర్కొన్నారు. అయితే జుబైర్ నడిపే సంస్థకు పాకిస్తాన్, సిరియాల నుంచి నిధులు వస్తున్నట్లు గ్రహించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇది తేలికపాటి కేసు కాదని, ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలివిగా ట్వీట్ డిలీట్ చేశాడని చెప్పారు. ఎఫ్ఐఆర్ సాక్షాలను తొలగించే ప్రయత్నం చేశారని పేర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయనపై ఐపీసీ సెక్షన్-201, 120బి, విదేశీ నిధుల చట్టం 2010 కింద కేసు జత చేశామని వెల్లడించారు.