జెండర్ రివీల్ పార్టీ.. 8 ఏళ్లకే మొదలైన పాప ట్రాన్స్ జర్నీ

దిశ, ఫీచర్స్ : ఒక కెనడియన్ ఫ్యామిలీ తమ ఎనిమిదేళ్ల కూతురికి జెండర్ రివీల్ పార్టీ నిర్వహించింది..Latest Telugu News

Update: 2022-07-16 07:23 GMT

దిశ, ఫీచర్స్ : ఒక కెనడియన్ ఫ్యామిలీ తమ ఎనిమిదేళ్ల కూతురికి జెండర్ రివీల్ పార్టీ నిర్వహించింది. ఆరేళ్ల వయసులోనే అంతర్గతంగా తాను అబ్బాయి మాదిరిగా ఫీల్ అవట్లేదని చెప్పడంతో ఆలోచనలోపడ్డ తల్లిదండ్రులు.. ఆమె ఐడెంటిటీని భారీ వేడుక ద్వారా బహిరంగంగా ప్రకటించారు.

కెనడాలోని ఒంటారియోకు చెందిన ఎల్లా స్కాట్.. తల్లిదండ్రులైన నిక్కీ, గ్రాహమ్‌కు మొదట ఈ విషయం చెప్పినప్పుడు కొంతకాలానికి అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ తొందరలోనే ఇందులోని సీరియస్‌నెస్‌ను గ్రహించారు. తమ కూతురి స్వేచ్ఛాయుత జీవితానికి అడ్డు చెప్పకుండా గ్రాండ్ పార్టీ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇక చిన్నతనంలో ఎల్లా ఎక్కువగా అమ్మాయిలతో స్నేహం చేయడం, బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించిన పేరెంట్స్.. ఆమె అందరికంటే కొంచెం భిన్నంగా ఉంటుందని భావించారు. అయితే ఆమె తన సోదరులతో కూడా ఆడుకునేందుకు ఇష్టపడకపోయేదని తల్లి నిక్కీ పేర్కొంది.

'ఆరేళ్ల వయసులో ఆమె స్కర్టుల వంటి అమ్మాయిల దుస్తులు ధరించేందుకు ఇష్టపడేది. దాన్ని ఒక ఫేజ్‌గా భావించాం. కానీ ఆ అలవాటు అలాగే కొనసాగింది. ఒక హాలోవీన్‌లో తననే సొంతంగా డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటే.. స్కర్ట్, పిల్లి చెవులతో కూడిన డ్రెస్ ధరించింది. ఏం చేయాలో తోచక ఎల్లాకు కొన్ని ట్రాన్స్ వ్యక్తుల పుస్తకాలు చూపించాం. అప్పుడు 'నేను అబ్బాయిని కాదు, నాకు లోపల అలా అనిపించడం లేదు' అని చెప్పింది. దీంతో సైకాలజిస్ట్‌ను సంప్రదించి నిర్ధారించుకున్నాం. మొదటి దశలో జుట్టును పొడవుగా పెంచడం, అమ్మాయిల దుస్తులు ధరించడం ప్రారంభించింది. తన స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్ కూడా ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చింది.  


Similar News