Pak New PM: భారత పీఎంకు రిప్లై ఇచ్చిన పాక్ కొత్త ప్రధాని.. షాక్‌లో ఆ దేశ ప్రజలు..

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర రాజకీయ సంక్షోభంతో పాక్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ ప్రధానిగా

Update: 2022-04-12 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర రాజకీయ సంక్షోభంతో పాక్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ తప్పుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ ప్రధానిగా ప్రతిపక్ష నేత సెహ్‌బాద్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. దీనికి పాక్ ప్రధాని ఇచ్చిన రిప్లై అందరినీ షాక్‌కు గురిచేసింది. భారత్‌ను పొగిడినందుకు ఇమ్రాన్‌పై దుమ్మెత్తిపోసిన పాక్ వాసులు ఇప్పుడు షెహ్‌బాస్ ట్వీట్‌కు ఖంగుతిన్నారు. 'ముందుగా మీకు కృతజ్ఞతలు. భారత్‌తో శాంతియుతమైన, పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోవడానికి పాక్ ఎదురుచూస్తోంది' అని షరీఫ్ అన్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వివాదాలు, జమ్మూకాశ్మీర్‌ వివాదంతో సహా అన్నింటిని శాంతియుతంగా పరిష్కరించుకుందాం. దాంతో పాటుగా సామాజిక ఆర్థిక వ్యవస్థ అభివృద్దిపై దృష్టి పెడదాం' షరీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా పాక్ ప్రధాని అలా మాట్లాడటం ఆ దేశ ప్రజలకే కాకుండా భారత ప్రజలకు వింతగా అనిపిస్తోంది. కొందరు దీని వెనుక అనేక కుట్రలు ఉన్నాయని అంటే మరికొందరు మాత్రం ఇన్నాళ్లకి పాక్‌కు బుద్ది వచ్చిందని అంటున్నారు. అదే తరహాలో పాకిస్తాన్‌లో సైతం షరీఫ్ మాటలను కొందరు వ్యతిరేకిస్తుంటే, మరికొందరు మద్దతు ఇస్తున్నారు.

Tags:    

Similar News