Samantha: ‘అప్పుడే అలాంటి వారికి సరైన సమాధానం చెప్పొచ్చు’.. దుమారం రేపుతున్న సమంత పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది.
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంది. అలా సంవత్సరం పాటు ఆరోగ్యం పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది. నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సామ్ సొంతంగా తెరకెక్కిస్తుండటం విశేషం. అయితే ఈ భామ ఓ వైపు సినిమాలు చేస్తునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా సమంత ఇన్‌స్టా వేదికగా ఓ పోయమ్‌ను(పద్యం) పోస్ట్ చేస్తూ.. ‘ఈ పద్యం నాకెప్పుడు మార్గదర్శకంగా ఉంది. ఈ రోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చింది. మరి అసలు పద్యం మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ‘మీరు రిస్క్‌తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్ళీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టాలి. అంతేకానీ ఆ ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని స్ట్రాంగ్ చేసుకుని మరింత ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. అప్పుడే మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పొచ్చు’ అనే అర్థంతో ఈ పద్యం ఉంది. ప్రస్తుతం ఈపోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన అభిమానులు సామ్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తుంది.