November 14: ‘చిల్డ్ర‌న్స్ డే’ ను పురస్కరించుకుని చిన్నారులకు భారీ శుభ‌వార్త చెప్పిన క‌ల్కి బృందం

ప్రేక్షుకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ చిత్రం ఒకటి.

Update: 2024-11-13 08:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేక్షుకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘కల్కి 2898 AD’(Kalki) చిత్రం ఒకటి. ప్రేక్షుకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘కల్కి 2898 AD’ చిత్రం ఒకటి. నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌(Vyjayanthi Movies Banner)పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు.

ఈ సూపర్ హిట్ సినిమాలో శోభన(Śōbhana), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), దీపికా పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అన్నా బెన్(Anna Ben), దుల్కర్ సల్మాన్(Dulkar salmān), మాళవిక నాయర్(Māḷavika nāyar), మృణాల్(Mrinal) తదితరులు అద్భుతమైన ఫర్మామెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం కల్కి రెండో భాగం కోసం దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎక్కువగా వాడిన బుజ్జి వాహనం సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇది కల్కి సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇకపోతే రేపు (నవంబరు 14) చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని చిన్న పిల్లలకు కల్కి యూనిట్ భారీ గుడ్‌న్యూస్ అందించింది.

రేపు హైదరాబాదు(Hyderabad)లో ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్(Prasad's Multiplex) వద్ద కల్కి సినిమాలోని బుజ్జి వాహనాన్ని ఉంచనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ప్రసాద్ మల్లీఫ్లెక్స్ వద్దకు వచ్చి చిన్నారులు వాహనాన్ని స్వయంగా చూడొచ్చని తెలిపారు. ‘‘‘ఈ బాలల దినోత్సవం(Children Days) సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ లో మా #బుజ్జిని కలవడానికి మీ చిన్నారులను తీసుకురండి.’ అని సోష‌ల్ మీడియాలో కల్కి బృందం రాసుకొచ్చింది. దీంతో చిన్నారులు ఎగిరిగంతులేస్తున్నారు.

Full View

Tags:    

Similar News