బోదన్ అల్లర్లలో అరెస్ట్ అయిన వారితో ఓవైసీ ములాఖాత్..

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ సారంగాపూర్ లోని జిల్లా జైలులోని ఖైదీలను ఎంఐఎం పార్టీ అధినేత latest telugu news..

Update: 2022-03-26 15:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ సారంగాపూర్ లోని జిల్లా జైలులోని ఖైదీలను ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం ములాఖాత్ అయ్యారు. ఇటీవల బోధన్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో పోలీసులు 70 మందికి పైగా కేసులు నమోదు చేసి.. అందులో కొందరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బోధన్ అల్లర్ల కేసులో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ప్రజాప్రతినిధులతో పాటు హిందువాహిని, శివసేన నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా ఎంఐఎం నేతలను ములాఖాత్ సమయంలో కలుసుకుని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ వెంట ఎంఐఎంకు చెందిన నిజామాబాద్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, ఫ్లోర్ లీడర్ షకిల్, కార్పొరేటర్ అసద్ బేగ్, నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News