నిధులు రాక ఏడాదిగా ఆగిన పనులు..

ఎన్నో ఏళ్లుగా ఒక వరుస రోడ్డు గుంతల మయమై ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2025-04-01 12:51 GMT
నిధులు రాక ఏడాదిగా ఆగిన పనులు..
  • whatsapp icon

దిశ, శివ్వంపేట : ఎన్నో ఏళ్లుగా ఒక వరుస రోడ్డు గుంతల మయమై ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు తీర్చేందుకు గత ఏడాది కిందట రూ.20 కోట్లతో 9 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ పనులు చేపట్టి నిధులు రాక ఏడాది కిందట పనులు నిలిపివేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం నుంచి శివ్వంపేట మండలం నవాబ్ పేట, లచ్చి రెడ్డి గూడెం, గోమారం, చండి గ్రామం రోడ్డు మధ్యల వరకు ఒక వరుస రోడ్డును విస్తరిస్తున్నారు.

ఏడాది కిందట రోడ్డు విస్తరణకు కంకర, మట్టి పనులు చేసి నిధులు రాక పనులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రోడ్డు పై గుంతలు, కంకర రోడ్డుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మండలంలోని ఎన్నో గ్రామాల ప్రజలు హైదరాబాద్ నగరానికి ఈ మార్గం గుండనే రాకపోకలు సాగిస్తారు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఆగిపోయిన పనులు పూర్తిచేయాలని ఆయా మండల ప్రజలు కోరుతున్నారు.

Similar News