దిశ ఎఫెక్ట్.. 'వెలుగు శాఖలో అవినీతి' శీర్షికకు స్పందించిన అధికారులు!

దిశ, కోటపల్లి: దిశ పత్రికలో ప్రచురించిన - Officials responding to the headline "Corruption in the light department" published in disha magazine

Update: 2022-03-09 10:22 GMT

దిశ, కోటపల్లి: దిశ పత్రికలో ప్రచురించిన "వెలుగు శాఖలో అవినీతి" అనే శీర్షికకు స్పందించిన అధికారులు బుధవారం నాడు మండలంలోని అలుగామ గ్రామానికి విచారణ కోసం జిల్లా ఏ పి డి శ్రీనివాస్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి అప్పటి CA మల్లేష్ ను విచారించగా అవినీతి జరిగిన మాట వాస్తవమే అని నిర్ధారించడం జరిగింది. ఇలా డబ్బులు కట్టినట్లు దొంగ రసీదులు ఇచ్చి మహిళలను మోసం చేస్తుంటే APM, CC లు ఏమి చేస్తున్నారని నిలదీశాడు.


మీరు సక్కగా పని చేయకపోవడం వల్ల CA లు ఇలా తయారయ్యారు అని నిలదీశాడు. ఇంకా ఇలాంటి అవినీతి ఊరిలో చాలా ఉన్నాయని మహిళలు డీపీఎం కి చెప్పడంతో దగ్గరుండి పిలిపించి విచారణ జరపగా అందులో దుర్గం ఈశ్వరి, దుర్గం వీళ్ళందరూ బాధితులే అని తేలడం జరిగింది. తక్షణమే ఎపిడి శ్రీనివాస్, మల్లేష్ దగ్గర నుండి తప్పును ఒప్పుకున్నట్లు వీరి డబ్బులను 14 తేదీ వరకు కడుతున్నట్టు అప్లికేషన్ తీసుకున్నాడు.


అలాగే గ్రూప్ లలో పేరు నమోదుకు డబ్బులు తీసుకోవడం, ఒకరు లోన్ కట్టమని డబ్బులిస్తే ఒకరి పేరుతో మరొకరికి కట్టడం.. ఇలా తవ్విన కొద్ది వెలుగులో అవినీతి బయట పడింది. దీంతో సి ఏ మల్లేష్ దగ్గర ఉన్న ట్యాబ్, రికార్డ్స్ సీసీ హ్యాండోవర్ చేసుకోవడం జరిగింది. ఇలా అవినీతి జరుగుతున్నందున డబ్బులు నేరుగా బ్యాంక్ లో సంఘం వారే వేసుకోవాలని, ఏ అధికారికి నేరుగా డబ్బులు ఇవ్వకూడదు అని మహిళలకు తెలియజేశారు. ఈ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ విచారణలో APM రాజన్న, CC సుధాకర్, మహిళా సంఘాల లీడర్లు, మహిళ సంఘాల మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News