నిరుద్యోగులకు అలర్ట్: ముందుగా వేసే నోటిఫికేషన్లు ఇవే?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొలువుల భర్తీపై వేగం పెంచారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రావడంతో ఆర్థిక శాఖ తొలి దఫా 30,453 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2022-03-24 08:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొలువుల భర్తీపై వేగం పెంచారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రావడంతో ఆర్థిక శాఖ తొలి దఫా 30,453 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ముందుగా రెండు రిక్రూట్​మెంట్ సంస్థల నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. రోస్టర్​పాయింట్లు, రిజర్వేషన్లు తేలగానే గ్రూప్​ –1 నోటిఫికేషన్‌ను టీఎస్​పీఎస్సీ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లపై సిద్ధంగా ఉంది. అయితే, శాఖల వారీగా గ్రూప్​–1 పోస్టులపై ముందుగా 5‌‌03 ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆయా శాఖల నుంచి పోస్టుల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. సంబంధిత శాఖల్లో ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను టీఎస్​పీఎస్సీకి పంపించిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా పోలీస్​రిక్రూట్​మెంట్​బోర్డు నుంచి 16,587 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన అన్ని వివరాలు సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ముందు నుంచీ పోలీస్ శాఖ భర్తీపై ప్రభుత్వం రెడీగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం నిబంధనలేమీ మార్చలేదు. దీంతో పోలీస్​రిక్రూట్​మెంట్​ బోర్డు నుంచి కూడా నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉంది.

ఆ తర్వాత మిగిలినవి

ముందుగా టీఎస్​పీఎస్సీ నుంచి 503 గ్రూప్ –1 ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి 16 వేల పోస్టులను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగిలిన శాఖల్లో విడుదల చేయనున్నారు. అటు టెట్‌లో కూడా కొన్ని సవరణలు చేయడంతో దానిపై సాంకేతిక సమస్యలు రాకుండా చేసిన తర్వాతే టెట్ నిర్వహించనున్నారు. దాదాపు టెట్ కోసం 3 లక్షల మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News