రైల్వే ప్రైవేటీకరణ ఆలోచన లేదు: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు..telugu latest news

Update: 2022-03-16 16:22 GMT

న్యూఢిల్లీ: రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి భారతీయ రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని అన్నారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే శాఖ గ్రాంట్లపై ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇటీవలి అపార్థాన్ని రైల్వేలు పరిష్కరించుకున్నాయని మంత్రి చెప్పారు. రిక్రూట్ మెంట్ పై ఎలాంటి నిషేధం లేదు. 1.14 లక్షల ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది అని అన్నారు. అనంతరం రైల్వే గ్రాంట్ల కోసం డిమాండ్లను ముజువాణీ ఓటు ద్వారా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రైవేటీకరణపై స్పందిస్తూ.. ఇది కేవలం ఊహాజనితం మాత్రమే.. ట్రాక్స్, స్టేషన్లు, ఇంజిన్లు, ట్రెయిన్లు, సిగ్నల్ వ్యవస్థ అంతా రైల్వేకే సొంతం. ప్రైవేటీకరణపై ఎలాంటి చర్చ లేదు. రైల్వేలను ప్రైవేటీకరణ చేసే ప్రణాళికలు లేవు అని అన్నారు. అంతేకాకుండా రైల్వేలు సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. దానిలో భాగంగానే రూ.60వేల కోట్ల సబ్సిడీ అందించామని అన్నారు.

Tags:    

Similar News