డేంజరస్ ఫొటో షూట్.. ఎక్కడ ఎలా తీసుకున్నారో తెలుసా ?

దిశ, ఫీచర్స్ : వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం సాధారణమైన ఫొటోలు క్లిక్ చేసే రోజులు పోయాయి. ఒకరిని మించి మరొకరు వింత వింత థీమ్స్‌తో ప్రీ, పోస్ట్-వెడ్డింగ్ షూట్స్‌ ప్లాన్ చేస్తున్నారు..Latest Telugu News

Update: 2022-06-27 05:07 GMT

దిశ, ఫీచర్స్ : వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం సాధారణమైన ఫొటోలు క్లిక్ చేసే రోజులు పోయాయి. ఒకరిని మించి మరొకరు వింత వింత థీమ్స్‌తో ప్రీ, పోస్ట్-వెడ్డింగ్ షూట్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో హనీమూన్ ఫొటోషూట్స్ కూడా ట్రెండింగ్‌లో నిలుస్తుండగా.. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ తమ హనీమూన్ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలుపై ఫొటోలు తీయించుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

క్రొయేషియన్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ క్రిస్టిజన్ ఇలిసిక్, ఆండ్రియా ట్రిగోవ్‌సెవిక్ తమ హనీమూన్ ఫొటోషూట్‌ను ఇదివరకు ఎవరూ చేయని విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వాళ్లు 'ట్రైన్ డు డెసర్ట్' అని పిలిచే 2కి.మీ పొడవైన గూడ్స్ రైల్లో సహారా ఎడారిలో ఫొటోషూట్ నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రైలు ప్రయాణంలో ఈ జంట 20గంటల పాటు ప్రయాణించి ఫొటోషూట్ కానిచ్చారు.

'20 గంటల రైడ్ నిజంగా సవాలుగా ఉన్నప్పటికీ మేం ఫొటోషూట్ విజయవంతంగా పూర్తిచేశాం. వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండగా, రాత్రి సమయంలో మాత్రం సున్నా డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు దుమ్ముతో కూడిన గాలి వీయడంతో మా శరీరమంతా మట్టితో నిండిపోయింది. చాలా కష్టతరమైన ప్రయాణమిది'

-క్రిస్టిజన్ ఇలిసిక్, ఆండ్రియా ట్రిగోవ్‌సెవిక్


Similar News