చర్మంతో రంగులు గుర్తించే రోబో!

దిశ, ఫీచర్స్ : రోబోలు ఇప్పటికే మనుషులుచేసే అన్ని పనులను రెట్టింపు వేగం, మరింత కచ్చితత్వంతో చేస్తున్నాయి..Latest Telugu News

Update: 2022-07-17 08:01 GMT

దిశ, ఫీచర్స్ : రోబోలు ఇప్పటికే మనుషులుచేసే అన్ని పనులను రెట్టింపు వేగం, మరింత కచ్చితత్వంతో చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రాబోయే రోజుల్లో రోబోలు రంగులను కూడా చూడగలవని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకుల బృందం వెల్లడించింది. కానీ సకల జీవుల వలె ఇవి కళ్ల ద్వారా కాకుండా తమ చర్మం ద్వారా చూడగలుగుతాయని పేర్కొంది.

మానవ దృష్టికి మించిన లైట్ రేంజెస్(కాంతి పరిధులు) గుర్తించే ఎలక్ట్రానిక్ చర్మాన్ని గ్లాస్గో విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ మెటీరియల్‌పై చిన్న సెమీకండక్టర్స్‌తో తయారు చేసిన ఈ-స్కిన్‌ను ఇంజనీర్లు అనేక ఉపరితలాలకు(సర్ఫేస్) వర్తింపజేస్తున్నారు. సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్‌లో పనిచేసే రోబోలకు ఈ స్కిన్ ఉపయోగపడుతుందని.. ఉదాహరణకు లైట్ సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉపయోగించే మెకానికల్ ఆయుధాలకు సంబంధించి పరిస్థితులు మారినప్పుడు, వాటి భద్రత లేదా ప్రభావం ప్రమాదంలో పడినప్పుడు రోబోలు గుర్తించగలవని పరిశోధకులు వెల్లడించారు.

ఈ-స్కిన్ కాంతిని కొలిచేందుకు కేవలం 2.5 మిల్లీసెకన్లు పడుతుంది. ఇది అతినీలలోహిత నుంచి ఇన్‌ఫ్రారెడ్ వరకు, విద్యుదయస్కాంత వర్ణపటం నుంచి మానవులు చూడగలిగే కాంతి వరకు అన్నిరకాల కాంతి రంగులను గుర్తిస్తుంది. ఈ-స్కిన్ దాని వేగవంతమైన ప్రతిస్పందన సమయాల కారణంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్‌లో కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు బృందం అభిప్రాయపడింది. 


Similar News