ఆధార్ అథెంటికేషన్‌కు కొత్త యాప్.. ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ పూర్తి

దిశ, ఫీచర్స్ : భారతీయ పౌరుల గుర్తింపును ధ్రువీకరించే పత్రం 'ఆధార్'. బ్యాంక్ అకౌంట్ తెరవడం నుంచి సిమ్ కార్డు పొందడం వరకు ఆధార్‌తోనే పని.

Update: 2022-07-14 12:23 GMT

దిశ, ఫీచర్స్ : భారతీయ పౌరుల గుర్తింపును ధ్రువీకరించే పత్రం 'ఆధార్'. బ్యాంక్ అకౌంట్ తెరవడం నుంచి సిమ్ కార్డు పొందడం వరకు ఆధార్‌తోనే పని. ఇదంతా ఒకెత్తయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్కాలర్ షిప్స్ పొందాలన్నా.. బయోమెట్రిక్ తప్పనిసరి. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు అనేక రూపాల్లో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఆర్‌డీ పేరుతో సరికొత్త యాప్‌కు శ్రీకారం చుట్టింది.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్ :

స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఏ ప్లేస్ నుంచైనా ఫేస్ స్కానింగ్‌తో ఆధార్ అథెంటికేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్ ద్వారా జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కొవిడ్, ఫార్మర్ వెల్ఫేర్ పథకాలను యూజ్ చేసుకోవచ్చని యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. దాంతోపాటు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని యూఐడీఏఐ ఇన్‌హౌస్‌లో డెవలప్ చేసిందని.. ఈ యాప్ టెక్నాలజీ ఉపయోగించి అవసరమున్న వక్తి ఫేస్‌ను క్యాప్చర్ చేస్తుందని UIDAI ట్వీట్‌లో పేర్కొంది. ఇక ఆధార్ ఉన్నవారు డెమొగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథెంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఆ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా Aadhaarఉండాల్సిందే.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు 

పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును ఇలా మార్చుకొండి 

Tags:    

Similar News