'నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం'..

దిశ, ఫీచర్స్: ‘నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం’ : వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు..Latest Telugu News

Update: 2022-07-18 03:49 GMT

దిశ, ఫీచర్స్: 'నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం' : వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మండేలా గౌరవార్థం ఆయన పుట్టినరోజునే వేడుకలు నిర్వహించాలని 2009 నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో 192 మంది సభ్యులు ఆమోదించారు. 2009 ఏప్రిల్ 27న నెల్సన్ మండేలా ఫౌండేషన్..

మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కోసం ప్రపంచ దేశాల మద్దతు కోరింది. 2009 జులై 18న మొట్టమొద‌టిసారిగా న్యూయార్క్‌లో మండేలా దినోత్సవాన్ని జ‌రుపుకున్నా‌రు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సమాజ సేవకు గుర్తుగా అతని విలువలను గౌరవించేందుకు ఈ ప్రత్యేక రోజున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయనను స్మరించుకుంటారు.


Similar News