జాతీయ వైద్యుల దినోత్సవం..
దిశ, ఫీచర్స్: ఇండియాలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా జులై 1న నిర్వహించుకుంటాం..Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఇండియాలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా జులై 1న నిర్వహించుకుంటాం. వైద్య వృత్తిలో ఎనలేని సేవలందించిన 'డాక్టర్ బిధాన్ చంద్రరాయ్' జయంతి 1882 జులై 1ని పురస్కరించుకుని వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. ఇక 80 ఏళ్ల వయసులోనూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిధాన్.. సీఎం కాకముందు వైద్యుడిగా ఎంతో మంది పేదల ప్రాణాలను నిలబెట్టడంతో ఆయనను వారంతా దైవంగా కొలిచారు.
బిధాన్ వైద్య రంగానికి చేసిన విస్తృత కృషికి గాను 1961 ఫిబ్రవరి 4న దేశ అత్యున్నత పౌర పురస్కారంతో పాటు భారతరత్నతో సత్కరించారు. కాగా నేడు వైద్యులకు గ్రీటింగ్స్, పుష్ఫగుచ్చాలు అందించడంతో పాటు వారు చేసిన సేవలను దేశమంతా గుర్తుంచుకునేలా పలు కార్యక్రమాలు చేపడతారు. దీంతో పాటు ఈ రోజున 'చార్టర్డ్ అకౌంటెంట్స్', 'వాస్తు దినోత్సవం' కూడా జరుపుకుంటారు.