Nagarjuna: ఎందుకండి చేతులు కాల్చుకోవడం.. ఏయన్నార్ బయోపిక్‌పై నాగార్జున్ షాకింగ్ కామెంట్స్!
గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకకు హాజరైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఏయన్నార్ (ANR) బయోపిక్ (biopic)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దిశ, సినిమా: గోవాలోని పనాజీలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకకు హాజరైన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఏయన్నార్ (ANR) బయోపిక్ (biopic)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నాన్న గారి బయోపిక్ గురించి ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఆయన జీవిత చరిత్రను సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుంది. ఏయన్నార్ జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎదుగుదల పెరుగుతూనే పోయింది. అలాంటి ఆయన జీవిత చరిత్రను సినిమాగా తెరపై చూడాలంటే బోర్ కొడుతుందేమో! ఒడుదొడుకులు చూపిస్తేనే సినిమా బాగుంటుంది. అందుకే ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలు చేర్చి డాక్యుమెంటరీగా తీయాలనుకుంటున్నాము’ అని తెలిపారు.
అనంతరం ఈవెంట్ నుంచి నాగార్జున బయటకు వస్తుండగా.. ‘ఏయన్నార్ నటించినవి చాలా ప్రేమ కథ చిత్రాలు ఉన్నాయి. అవి నాగచైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) గానీ రిమేక్ చేసే అవకాశాలు ఉన్నాయా’ అని మీడియా ప్రశ్నించింది. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ‘ఎందుకండి ఆయన సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం’ అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read More...
Naga Chaitanya: 'విరూపాక్ష' డైరెక్టర్‌తో నాగ చైతన్య సినిమా.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్