Naga Chaitanya: నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు

అక్కినేని ఇంట్లో శోభిత అడుగుపెట్టబోతోంది అని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Update: 2024-11-17 07:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : సమంత ( Samantha) , నాగచైతన్య (Naga Chaitanya) ప్రేమ పెళ్ళి చేసుకుని నాలుగేళ్ళు బాగానే ఉన్నారు కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. ఇక సమంత - నాగచైతన్య సెపరేట్ అయి ఇద్దరు ఎవరి పనులలో వారు బిజీ అవ్వగా, నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితతో (Sobhita Dhulipala) డేటింగ్ చేస్తూ వచ్చారు, ఈ విషయం ఎక్కడా కూడా బయటకు రానివ్వలేదు.

ఎన్నో సార్లు సోషల్ మీడియాకి చిక్కిన కానీ, ఇద్దరూ బాగానే కవర్ చేసుకుంటూ వచ్చారు. కొందరైతే వీరి ఫొటోస్ పెట్టి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పోస్ట్ లు కూడా పెట్టారు. నాగ చైతన్య ని ఈ విషయం గురించి పలు సార్లు అడిగినా కూడా టాపిక్ డైవర్ట్ చేశాడు.

మొదట ఈ విషయాన్ని ఇద్దరూ కొట్టి పారేశారు .. కానీ, ఒక రోజు ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇక, ఇప్పుడూ అందరూ ఊహించినట్టుగానే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరగనుందంటూ వెడ్డింగ్ పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ షేర్ చేశారు. ఇక ఇప్పటివరకు వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి , అక్కడే వివాహం జరిపించబోతున్నట్లు తెలిసిన సమాచారం. మొత్తానికి, అక్కినేని ఇంట్లో శోభిత అడుగుపెట్టబోతోంది అని తెలిసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Read More...

Meenakshi Chaudhary: అక్కినేని హీరోతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

Tags:    

Similar News