‘కంగువ’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీటే!
స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ శివ (Shiva) కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ (Kanguva).
దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య (Surya), డైరెక్టర్ శివ (Shiva) కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ (Kanguva). దిశ పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. బాబీ దేవోల్ (Bobby Deol) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్ (Studio Green), యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం (Movie Unit) . అలాగే వరుస అప్‌డేట్స్ (Updates) ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ‘నాయకా’ (Naayaka) లిరికల్ సాంగ్ (lyrical song) రిలీజ్ చేశారు. ‘నాయకా మా నాయకా నాయకా మా నాయకా.. ధీర ధీర కదన విహార ధీర రారా అగ్ని కుమారా’ అంటూ సాగే ఈ సాంగ్‌కు ప్రముఖ సింగర్ దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) పవర్ ఫుల్ ట్యూన్ కంపోజ్ (compose) చేయగా.. రాకేందు మౌళి (rakendumouli) లిరిక్స్ అందించారు. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ (viral) అవుతోంది.