యూస్‌లెస్ ఫెల్లో.. ఎమ్మెల్యే ముందే మున్సిపల్ కమిషనర్, డీఈ రగడ
దిశ, పరిగి : యూస్ లెస్ఫెల్లో నేను కాదు నువ్వే యూస్ లెస్ఫెల్లో అంటూ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డీఈ.. Latest Telugu News..
దిశ, పరిగి : యూస్ లెస్ఫెల్లో నేను కాదు నువ్వే యూస్ లెస్ఫెల్లో అంటూ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డీఈ ఒకరిపై ఒకరకు విరుచుకుపడ్డారు. పరిగి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి కంపు తిట్లదండకానికి దారితీసింది. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ముందే అధికారులు ఒకరిపై ఒకరు తిట్లు సంధించుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్‌కార్యాలయంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో అవినీతి కంపు, దొంగ బిల్లలుపై మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ డీఈ యూనూస్ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో కౌన్సిలర్లు చేసిన పనుల బిల్లులు చెల్లించడంలో ఆలస్యమవుతుందని కౌన్సిలర్లు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు కమీషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి కల్పించుకొని మాట్లాడుతూ.. డీఈ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని, అతనికి పనులు చేయడం చేతకాదని డీఈ యూనూస్పై ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకు మున్సిపల్ డీఈ యూనూస్ సమాధానం ఇస్తూ తప్పుడు లెక్కలు, దొంగ బిల్లులు పెట్టి రికార్డు చేయమంటున్నాడు ఎలా రికార్డు చేస్తారు అంటూ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. నేను దొంగ బిల్లులు పెట్టానా యూస్‌లెస్ ఫెల్లో నీకు పనిచేయడం చేతకాదు, నీకు జీతం ఇవ్వడం వేస్ట్ అంటూ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఇందుకు డీఈ యూనూస్ నన్నే యూస్లెస్ఫెల్లో అంటావా నువ్వే యూస్‌లెస్ ఫెల్లో అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకున్నారు.
టెండర్లు పిలవకుండానే పనులు చేస్తూ, చేసిన పనులకు కౌన్సిలర్లు, ఇతర కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందంతా చూస్తున్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి కల్పించుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇలా సమావేశాల్లో తిట్టుకుంటారా, మరోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ది చేస్తామన్నారు. ఇదంతా చూస్తున్న పరిగి మున్సిపల్ ప్రజలు కమిషనర్‌పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎవరి తోకచుట్టమని ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదని అనుకుంటున్నారు.
లేదా కమీషనర్ చేస్తున్న అవినీతిలో ఎవరి చేతవాటం వాళ్లు చూసుకొని పైకి ఇలా మేకపోతు గాంభీర్యం వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని మరి కొందరు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, వైస్చైర్మన్కల్లు ప్రసన్న లక్ష్మీ, కౌన్సిలర్లు అర్చన, వేముల కిరణ్కుమార్గుప్త, ఎదిరె కృష్ణ, జరుపుల శ్రీనివాస్, నాగేశ్వర్, మునీర్, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.