వెంటపడి వేధిస్తున్నారా? ముంబై పోలీస్ హెచ్చరిక పోస్ట్!

దిశ, ఫీచర్స్ : సాధారణంగా సినిమాలు లేదా స్టేజ్ షోస్‌లో పురుషులు తరచుగా మహిళలపై తమ ప్రేమను వ్యక్తపరచడం కనిపిస్తుంటుంది. ఒకవేళ సదరు మహిళ తమ ప్రతిపాదనను తిరస్కరించినా వినకుండా మొండిగా వెంటపడుతుంటారు..Latest Telugu News

Update: 2022-06-23 08:18 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా సినిమాలు లేదా స్టేజ్ షోస్‌లో పురుషులు తరచుగా మహిళలపై తమ ప్రేమను వ్యక్తపరచడం కనిపిస్తుంటుంది. ఒకవేళ సదరు మహిళ తమ ప్రతిపాదనను తిరస్కరించినా వినకుండా మొండిగా వెంటపడుతుంటారు. ఇలాంటి కథనాన్నే ముంబై పోలీసులు తమ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రతిఘటించారు. ఈ విధంగా ప్రవర్తించకూడదంటూ ప్రజలను కోరారు. ఇందుకోసం పాపులర్ కామెడీ సిరీస్ సిట్‌కామ్ 'ఫ్రెండ్స్' నుంచి వీడియో క్లిప్‌ ఉపయోగించి జనాల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు వెంబడింపులు, లైంగిక వేధింపులు ఎదురైనపుడు పోలీస్ హెల్ప్‌లైన్ 100కు కాల్ చేయాలంటూ ఈ పోస్టు ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

ముంబై పోలీసులు షేర్ చేసిన సిట్‌దిశ, ఫీచర్స్ : సాధారణంగా సినిమాలు లేదా స్టేజ్ షోస్‌లో పురుషులు తరచుగా మహిళలపై తమ ప్రేమను వ్యక్తపరచడం కనిపిస్తుంటుంది. ఒకవేళ సదరు మహిళ తమ ప్రతిపాదనను తిరస్కరించినా వినకుండా మొండిగా వెంటపడుతుంటారు.మ్ క్లిప్ విషయానికొస్తే.. ఇందులో చాండ్లర్ అనే యువకుడు ఒక మహిళతో ఫోన్‌లో మాట్లాడుతూ 'హే జానిస్, మిమ్మల్ని వీధుల్లో వెంబడించినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.. బై' అంటూ కాల్ కట్ చేసి డోర్ గుండా పరుగెత్తుతాడు. ఈ వీడియోను తమ అధికారిక ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తూ 'ఇలాంటి పెద్ద తప్పు చేయగలరా? వీధుల్లో ఆమెను వెంబడించవద్దు' అనే క్యాప్షన్‌తో పాటు #SheMatters, #NoMeansNo, #Dial100 #friends హ్యాష్‌ట్యాగ్స్ జోడించారు. కాగా ఈ కామెడీ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు 'మీమ్స్ ద్వారా చట్టాలను బోధించడం! కేవలం ముంబై పోలీస్ అడ్మిన్‌కే చెల్లుతుంది'అని కామెంట్ చేస్తున్నారు. ముంబై పోలీస్ పేజీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.


Similar News