మోడీ రూ.26 లక్షల కోట్లు దోచుకున్నాడు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లు, హైవేల మీద టెంట్లు వేసుకొని టీఆర్ఎస్ నేతలు ఫొటోలకు ఫోజులు ఇస్తుంటే.. అది పోలీసులకు కనిపించలేదని, కానీ, మేము నిరసన తెలుపుతామంటే అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్లు, హైవేల మీద టెంట్లు వేసుకొని టీఆర్ఎస్ నేతలు ఫొటోలకు ఫోజులు ఇస్తుంటే.. అది పోలీసులకు కనిపించలేదని, కానీ, మేము నిరసన తెలుపుతామంటే అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం వడ్లు కొంటలేదని నిరసన తెలిపి, రైతులకు అండగా ఉండాలనుకున్న కాంగ్రెస్ పార్టీను కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యుత్ సౌధ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రజల నుంచి 26 లక్షల కోట్లు దోచుకున్నాడని కేటీఆర్ చెప్పాడని, దానిపై నిరసన తెలుపితే కూడా గృహ నిర్బంధం చేస్తారా? అని ప్రశ్నించారు. వరి కొనుగోళ్లు జరపాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కొట్లాడినా అడ్డుకుంటున్నారన్నారు. ఇవి అన్ని చూస్తుంటే కేసీఆర్, మోడీ అవిభక్త కవలలు అని అర్థమవుతుందన్నారు. వీళ్లిద్దరూ గూడుపుటాని చేసి లక్షల కోట్లు దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిళ్లర్లతో కుమ్మక్కై 50 లక్షల క్వింటాళ్ల వరిలో క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.2500 కోట్లు స్కాం చేశారన్నారు. రైతులను మోసం చేస్తుంటే పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రయత్నం కూడా చేయట్లేదన్నారు. మోడీ, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు, పెట్రో, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా, వడ్లు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా.. గురువారం విద్యుత్ సౌధ కార్యాలయాన్ని ముట్టడి చేసి తీరుతామని స్పష్టం చేశారు.