అప్పుల తెలంగాణగా మార్చొద్దు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను అప్పుల తెలంగాణ - MLA Rajagopal Reddy comments on Assembly Budget
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడారు. మాటిమాటికి తెలివి లేదని అర్ధతెలివితో మాట్లాడుతున్నారని సభలో వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సభలో కవిత్వాలు చెప్పొచ్చు.. పాటలు పాడొచ్చు.. ఒక్క నిమిషం కూడా మాట్లాడనివ్వరా అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదన్నారు. తెలంగాణ తెచ్చాం.. మిగులు బడ్జెట్ తెచ్చాం.. అనవసరంగా మాట్లాడం మానుకోవాలన్నారు. మేడిగడ్డ లిప్టు ఇరిగేషన్ తో ఏం సాధించారని ప్రశ్నించారు. అనవసరంగా ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు నిర్మించొద్దని, అప్పుల తెలంగాణ మార్చొద్దని కోరారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి యాదాద్రి పవర్ ప్రాజెక్టును ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
8 ఏళ్ల నుంచి విద్య, ఆరోగ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. మంచిపనులు చేస్తే స్వాగతిస్తాం.. అభినందిస్తామన్నారు. పేదల సొమ్ము పక్కదారి పడుతుంటే మాట్లాడటం తప్పా అన్నారు. శ్రీరాంసాగర్ నుంచి ఎల్లంపల్లికి 160 టీఎంసీలు.. మళ్లీ ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడం ఎందుకు అని ప్రశ్నించారు. దీంతో అదనపుఖర్చు అవుతుందని మండిపడ్డారు. దీనికి మంత్రి హరీష్ రావు సమాదానం ఇస్తూ 10 రూపాయలు ఎక్కువైనా రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఖర్చు ముఖ్యం కాదు.. రైతే సంక్షేమమే లక్ష్యం.. పైసల ఖర్చును పట్టించుకోబోమని స్పష్టం చేశారు.