ఉద్యమకారుని పాడె మోసిన మంత్రి నిరంజన్ రెడ్డి

దిశ, వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు.. Latest Telugu News..

Update: 2022-03-29 12:30 GMT
ఉద్యమకారుని పాడె మోసిన మంత్రి నిరంజన్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మణిగిళ్ల నాగిరెడ్డి పాడె మోశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్ టూర్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మణిగిళ్ల నాగిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. 2001 మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, మండల టీఆర్ఎస్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని నిరంజన్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఓ మంచి నాయకుడుని కోల్పోయిందని బాధపడ్డారు. ఉద్యమకారుడు నాగిరెడ్డి మృతి కారణంగా మంత్రి తను పాల్గొనాల్సిన కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, వెల్టూరు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News