PRABHAS: దానికోసం సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నానంటూ ప్రభాస్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’(Fouji), ‘కల్కి-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘స్పిరిట్’(Spirit) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. వరుస సినిమాలతో నిత్యం ఫుల్ బిజీ బిజీగా ఉండే డార్లింగ్ అప్పుడుప్పుడు సోషల్ మీడియా అభిమానులకు కూడా టచ్‌లో ఉంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టాడు.
అందులో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘గొప్ప మనసు ఉన్న నాగి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీ విజన్, కమిట్‌మెంట్ అన్ని నన్ను ఎంతో ఇన్పైర్ చేశాయి అలాగే చాలా నాకు చాలా లవ్‌ని పంపించాయి. ప్రజెంట్ కల్కీ-2 కోసం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను.. సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాను’ అని రాసుకొస్తూ బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. మేము కూడా నీ పెళ్లి కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము, తొందరగా మ్యారేజ్ చేసుకో అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
