ఆ నియోజకవర్గంలో వ్యవసాయ భూములు అమ్ముకోవద్దు: మంత్రి హరీష్ రావు

Update: 2022-02-16 11:12 GMT

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక లక్షా 60 వేల ఎకరాల భూమికి సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలతో నారాయణఖేడ్, సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.

నాలుగు నియోజకవర్గాలలో 3.89 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. 4,500 కోట్లతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తామని తెలిపారు. కావున స్థానిక రైతులు ఎవరూ వ్యవసాయ భూములు అమ్ముకోవద్దని హితవు పలికారు. ఇక్కడి భూములకు కోట్లల్లో ధరలు వస్తాయన్నారు. ఇక్కడి కంగ్టి, కల్హేర్, నారాయణ ఖేడ్, మనూరు, నాగల్గిద్ద, సిర్గాపూర్, పెద్ద శంకరం పేట మండలాలు ఎన్నడూ లేని అభివృద్ధిలో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జడ్పి అధ్యక్షురాలు మంజుశ్రీ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News