బహిరంగంగా కొట్టుకోవడానికి దారితీసిన వాట్సాప్ మాటల యుద్ధం..

దిశ, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల - Message from WhatsApp group in Nizamabad district led to clashes

Update: 2022-03-17 17:16 GMT

దిశ, బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో ఓ వాట్సప్ చర్చ పరస్పర దాడులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి ఓ వాట్సప్ గ్రూప్ లో బాన్సువాడకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని, స్ధానికంగా జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నట్టు బీజేపీ నాయకుడొకరు మెసేజ్ పెట్టారు.


దీనికి ప్రతిగా ఎవరు వచ్చిన మమ్మల్ని ఏం చేయలేరని, ఇక్కడి అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారని స్పందించారు. మరొకరు స్పందిస్తూ బీజేపీపై గెలిచి.. టీఆర్ఎస్ లో చేరిన ఓ సొసైటీ చైర్మన్ కు బీజేపీ ని విమర్శించే అర్హత లేదని ఖండించారు. తను ఇండిపెండెంట్ గా గెలిచానని అవతలి వ్యక్తి బదులు ఇచ్చాడు. ఇలా జరిగిన మాటల యుద్ధం దమ్ముంటే బయటికి రండి ఎవరి దమ్ము ఎంతో చూసుకుందాం అనే వరకు వెళ్ళింది. చివరికి


ఇరువర్గాలు పంతాలకు పోయి.. గ్రామంలో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దాడిలో బీజేపీ మోస్రా మండల అధ్యక్షుడు స్వామి, నాయకుడు శ్రీధర్ లకు గాయాలయ్యాయి. వీరిని ఆ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బీజేపీ జిల్లా నాయకుడు ధన్ పాల్ సూర్య నారాయణ, బీజేవైఎం నాయకుడు రోషన్ పరామర్శించారు.

Tags:    

Similar News