Mercedes Benz: అమ్మకాలలో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, 2022 జనవరి, మార్చి త్రైమాసికంలో అమ్మకాలలో 26% వృద్ధిని నమోదు చేసింది.

Update: 2022-04-09 07:03 GMT
Mercedes Benz: అమ్మకాలలో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, 2022 జనవరి, మార్చి త్రైమాసికంలో అమ్మకాలలో 26% వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొత్తం 4,022 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గత ఏడాది 2021 ఇదే కాలంలో కంపెనీ 3,193 యూనిట్ల అమ్మకాలను జరిపింది. సెమీ కండక్టర్ల సరఫరా కొరత, ఇన్‌పుట్ ఖర్చులు గణనీయంగా ఉన్నప్పటికి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. రానున్న రోజుల్లో మెర్సిడెస్ బెంజ్ ఇండియాకి 4,000 కార్లు లేదా రూ. 3,000 కోట్ల విలువైన ఆర్డర్‌లు ఉన్నాయి. 2022 లో సాధించిన అమ్మకాల పనితీరు గణనీయంగా ఉండటం వలన భవిష్యత్తులో వినియోగదారులకు మరిన్ని లగ్జరీ కార్లను అందుబాటు ధరలో తీసుకొస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO మార్టిన్ ష్వెంక్ అన్నారు.

Tags:    

Similar News