అధ్యక్షా.. నోట్ చేసుకున్నాం..!?
తెలంగాణ అసెంబ్లీ గాడి తప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం స్పీకర్అసహనాన్ని పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ గాడి తప్పినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం స్పీకర్ అసహనాన్ని పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ నియమావళిని మరిచి టీఆర్ఎస్ఎమ్మెల్యేల్లోని కొందరు మంత్రులు సీట్ల వద్ద పదే పదే చక్కర్లు కొట్టారు. ఒక్కో మంత్రి చుట్టూ ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు రౌండప్‌చేసి డిస్టర్బ్అయ్యేలా వ్యవహరించారు. దీంతో సభ్యులు అడిగే ప్రశ్నలను మంత్రులు స్పష్టంగా వినే పరిస్థితి లేదు. అంతేగాక సదరు మంత్రుల సీట్ల వద్దకు వెళ్లి బిగ్గరగా మాట్లాడుతుండటంతో స్పీకర్పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వశ్చన్‌అవర్‌లో జరిగిన ఈ వ్యవహారంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికే మంత్రులను డిస్టర్బ్చేయొద్దంటూ స్పీకర్పలుమార్లు సూచించినప్పటికీ, ఎమ్మెల్యేలు వినే పరిస్థితి కనిపించలేదు. బాధ్యత గల చట్ట సభలో ఉన్నామనే విషయాన్ని మరిచి విచిత్రంగా వ్యవహరించారు. దీంతో సహనాన్ని కోల్పోయిన స్పీకర్ ''మీకు ఎన్నిసార్లు సార్లు చెప్పాలంటూ' సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేలు ఇలా చేయడం కరెక్ట్ కాదని వారించారు.
జీరో అవర్‌లో సభ్యులు చెప్పే సమస్యలను మంత్రులు నోట్ చేసుకోవాల్సి ఉంటుందని, అలాంటి సమయంలో డిస్టర్బ్ చేయడమేమిటనీ మండిపడ్డారు. దీంతో కొందరు ఎమ్మెల్యేలు వారి సీట్లతో కూర్చోగా, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అదే విధానంలో వ్యవహరించారు. దీంతో తాను సూచించిన ఆదేశం సభలో అందరికీ వర్తిస్తుందని స్పీకర్చురకలు అంటించారు.
ముగ్గురు మంత్రులతోనే... ప్రతిపక్షాల గుస్సా....
సోమవారం అసెంబ్లీలో జరిగిన క్వశ్చన్‌అవర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యుల్లో సీరియస్నెస్కానరాలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఉండగా, మిగతా సభ్యులంతా గందరగోళాన్ని సృష్టించారు. మరోవైపు జీరో అవర్‌లో ఏ శాఖకు సంబంధించిన ప్రశ్న వచ్చినా 'నోట్ చేసుకున్నాం అధ్యక్షా, సంబంధిత మంత్రికి తెలియజేస్తాం' అంటూ పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డిలు స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే జీరో అవర్‌లో ఈ వ్యవహరంపై ప్రతిపక్షాలు గుస్సాను వ్యక్తం చేశాయి. మంత్రులు కేవలం నోట్ చేసుకుంటున్నారే తప్పా, పరిష్కారం లభించడం లేదని సీఎల్పీ లీడర్భట్టి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత సెషన్‌లో అడిగిన ప్రశ్నలకే ఇప్పటి వరకు సమాధానం రాలేదంటూ మండిపడ్డారు. పైగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం రావట్లేదన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. గడిచిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్చెప్పినా మంత్రులు ఆన్సర్లు ఇవ్వట్లేదని శ్రీధర్‌బాబు ఆరోపించారు. దీంతో జీరో అవర్లో వీలైనంత మంది మంత్రులు ఉంటే సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందన్నారు.