Varun Tej: అంచనాలు పెంచేస్తున్న మెగా హీరో ‘మట్కా’ సినిమా సాంగ్

మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం ‘మట్కా’(Matka).

Update: 2024-10-24 12:02 GMT

దిశ, సినిమా: మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం ‘మట్కా’(Matka). వరుణ్ తేజ్(Varun Tej), కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అందాల భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర(Naveen Chandra) కీలక పాత్రలో నటిస్తుండగా.. నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ చేస్తుంది.

అయితే నవంబర్ 14న ‘మట్కా’’(Matka) సినిమా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ ‘మట్కా’ నుంచి ‘‘తస్సాదియ్యా’’ (Thassadiyya)అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అంతా డబ్బులు పరంగా, జీవితానికి కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాట మూవీపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా.. ‘‘పక్కోడిని కిందకు తొక్కు.. ఒక్కడివే అందలమెక్కు. జీవించుట మానవ హక్కు. నీకెప్పుడు నువ్వే దిక్కు. ఏ డోరు కొట్టదు లక్కు’’ అనే లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.


Full View



Similar News