ఉత్తరాఖండ్, గోవా సీఎం అభ్యర్థులపై ప్రధాని కీలక సమావేశం!
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన- Meeting At PM's Residence Over UP, Other States' Government Formation
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై పలు రాష్ట్రాల్లో స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. ఇదే విషయమై ప్రధానమంత్రి అధికారిక నివాసంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పార్టీ చీఫ్ జేపీ నడ్డా, ఆయా రాష్ట్రాల కీలక నేతలతో ఆదివారం సమావేశమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నాయకుల అంచనాలను అందుకునేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతల ఓటమి కూడా కొత్త వారికి అవకాశమివ్వలానే విషయమై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, సమావేశానికి కొన్ని గంటల ముందే మణిపూర్ నుంచి బిరేన్ సింగ్ మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఇక ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ సీఎం గా యోగీ ఆదిత్యనాథ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన శుక్రవారం రోజున ప్రమాణస్వీకారం కూడా చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో కీలక మంత్రులు ఓటమి కాస్తా, యోగీకి తంటాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పటికీ ఆయన నూతన మంత్రి వర్గ కూర్పుపై ఎటు తేల్చలేదు.
గోవాలో ఎవరో..?
చిన్న రాష్ట్రం గోవాలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. తాజా సమావేశంలో ఈ అంశంపై కూడా విస్తృతంగా చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం జాబితాలో ప్రమోద్ సావంత్ మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సోమవారం రాష్ట్ర నేతలతో సమావేశం తర్వాత దీనిపై అధికారికి ప్రకటన చేయనున్నట్లు అధికారికి వర్గాలు వెల్లడించాయి.
దేవభూమి ఎవరిని వరిస్తుందో..?
దేవభూమి ఉత్తరాఖండ్ లో మాజీ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమి కొత్త చర్చకు తెరలేపింది. పార్టీ గెలిచి ఆయన ఓడిపోవడంతో కొత్త సీఎం ఎవరనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు సోమవారం విధాన సభలో ప్రమాణ స్వీకారం చేయాలని పార్టీ రాష్ట్ర చీఫ్ మదన్ కౌశిక్ సమాచారమిచ్చారు. అనంతరం పార్టీ శాసనసభ సమావేశం తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు పుష్కర్ సింగ్ దానికి మద్దతు ఇవ్వడం గమనార్హం.