టెక్నాలజీ సాయంతో హ్యూమన్ ఎమోషన్స్‌కు రిలీఫ్..

టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్.. మిస్ మ్యాచింగ్‌గా అనిపించవచ్చు కానీ ఈ 30 ఏళ్ల యువతి ఆ రెండింటిని ఒకేచోట చేర్చుతూ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌గా మార్చేసింది.

Update: 2022-08-04 03:15 GMT

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ, హ్యూమన్ ఎమోషన్స్.. మిస్ మ్యాచింగ్‌గా అనిపించవచ్చు కానీ ఈ 30 ఏళ్ల యువతి ఆ రెండింటిని ఒకేచోట చేర్చుతూ మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌గా మార్చేసింది. మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న ఆమె వయసున్న వ్యక్తులకు తమ భావాలను పంచుకునేందుకు సురక్షిత స్థలం లేకపోవడమే వ్యాపార ఆలోచనకు ప్రేరేపించింది. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని డీప్ టెక్నాలజీతో కూడిన మెంటల్ హెల్త్ యాప్‌ 'జంపింగ్ మైండ్స్'కు శ్రీకారం చుట్టింది. మానసికంగా సరిగ్గా లేని వ్యక్తులు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా ఇతరులతో చాట్ చేసే స్పేస్‌ను నిర్మించింది. తన యాప్ అందరికీ సురక్షితమైన స్థలం అంటోంది అరీబా ఖాన్. జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఎలాంటి భయాలు లేకుండా మాట్లాడవచ్చని తెలిపింది.

మన జీవితంలో ఏదో ఒక ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. బ్యాడ్ బ్రేకప్, ఆఫీస్‌లో డిఫికల్ట్ టైమ్స్, కుటుంబం సర్దుబాటులో కష్టాలు.. తదితర అనుభవాలు ఎదుర్కొనే వ్యక్తులతో కనెక్ట్ అయ్యే డిజిటల్ స్పేస్ 'జంపింగ్ మైండ్స్'లో తమ ఎక్స్‌పీరియన్స్, ఎమోషన్స్‌ను పంచుకుని ఉపశమనం పొందవచ్చని వెల్లడించింది.


మెంటల్ హెల్త్ మ్యాటర్స్: ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు మెంటల్ హెల్త్ డిజార్డర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటంతో ఎక్కడో డీస్టిగ్మటైజేషన్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడింది అరీబా. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని.. మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న కళంకం, అపోహల కారణంగా 'జంపింగ్ మైండ్స్‌'ను రిలాక్సేషన్ స్పేస్‌గా మార్చేందుకు తీసుకొచ్చామని వివరించింది. తన ప్లాట్‌ఫామ్ సాంకేతికతకు సంబంధించినదే అయినా.. టెక్నాలజీ ద్వారా మానవ హృదయం కాస్త ప్రశాంతతను పొందుతుందని తెలిపింది. ఇక్కడ మనుషులు తమ ఎమోషన్స్ రిలీజ్ చేసి, ఆలోచనలను క్లియర్ చేసుకుని.. సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని వివరించింది.

కొవిడ్ మహమ్మారి కాలం మానసిక ఆరోగ్యాన్ని మరింత తీవ్రంగా పరిగణించేలా చేసింది. అయితే Gen-Z వ్యక్తులు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సమతుల్య, సంతోషకర జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. యువత ఆలోచనా విధానంలోని ఈ మార్పు అనేది పాజిటివ్ మైండ్‌సెట్‌తో లైఫ్ లీడ్ చేసేందుకు కారణమవుతుంది. కానీ మానసిక ఆరోగ్యం చుట్టూ అల్లుకున్న కళంకం.. తమ కథనాలను పంచుకోవడంలో అపరాధ భావాన్ని అనుభవించేలా చేస్తుంది.

యంగర్ జనరేషన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్

1. ఫ్యామిలీ లైఫ్, వర్క్‌లో స్ట్రెస్.. ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్ మీద ఇంపాక్ట్ చూపుతుంది. ఈ సమయంలో రిలేషన్‌షిప్స్ ఎలా మెయింటెన్ చేయాలో తెలియక ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. కొన్నిసార్లు 'బాగా లేకపోయినా ఓకే' అనే ధోరణితో ముందుకెళ్తారు. అలాంటి వైఖరిని విడిచిపెట్టాలని సూచిస్తోంది అరీబా ఖాన్.

2. సామాజిక ఆందోళన, సామాజిక పోలిక ఒక వ్యక్తిని అనేక విధాలుగా బాధపెడుతుంది. అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు డిజిటల్ డిటాక్స్ పొందాలి.

3. కళాశాల విద్యార్థులు తమ శరీర ప్రాధాన్యతలను అన్వయించే వయసు ఇది. కాబట్టి లైంగిక ఆరోగ్యం గురించి వారి మెదడులో చాలా ప్రశ్నలుంటాయి. వాటన్నింటికీ జంపింగ్ మైండ్స్‌లో సమాధానం దొరుకుతుంది.

4.కెరీర్‌లో మైలురాళ్లను అధిగమించాలనే కోరిక అనవసరమైన ఒత్తిడికి దారితీస్తుంది. 'సరైన పనిలోనే ఉన్నామా? సరైన వ్యక్తులతో పనిచేస్తున్నామా?' లాంటి ప్రశ్నలు మీలోనే ఉంచుకునే బదులు ఇక్కడ షేర్ చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది.

మెంటల్ పీస్ - హ్యాపీనెస్ హ్యాక్స్

1. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎల్లప్పుడూ ముందుండేందుకు ప్రయత్నించాలి. రోజులో కొంత సమయం ఒంటరిగా గడపడం చాలా ముఖ్యం.

2. పురుషుల కంటే స్త్రీలు అధిక ఒత్తిడిని కలిగి ఉంటారని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఎవరైనా తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచడానికి సమాజం మహిళలను అలవాటు చేసింది. అయితే వాళ్లు సూపర్ ఉమెన్ కాదు.. మనుషులే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అసంపూర్ణంగా ఉండటంలోనే నిజమైన అందం ఉన్నందున, ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని ఆశించకూడదు.

3. ఎప్పుడైనా సరే మెదడులో ఉన్న ఆలోచనలు బయటపెట్టేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడికి గురైతే ఓపెన్‌గా చెప్పాలి. తద్వారా ఇతరులకు ధైర్యాన్నిచ్చినవారు అవుతారు. మీ వల్లే సమాజంలో మార్పు మొదలవుతుందేమో చెప్పలేం కదా.

Tags:    

Similar News