Meesho: ఉద్యోగులకు ఏడాది పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్న మీషో!
Meesho announces Paid Leave Policy 'meeCare' Program| ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ మీషో తన ఉద్యోగుల కోసం విభిన్నమైన సెలవు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
బెంగళూరు: Meesho announces Paid Leave Policy 'meeCare' Program| ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ మీషో తన ఉద్యోగుల కోసం విభిన్నమైన సెలవు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులకు భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 'మీ కేర్ ' కార్యక్రమాన్ని ప్రారంభించిన కంపెనీ సరికొత్తగా సెలవు విధానంలో భాగంగా అపరిమిత సెలవు పాలసీ తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఉద్యోగులు అత్యధికంగా 365 రోజుల వరకు సెలవు పొందే అవకాశం లభిస్తుంది. అది కూడా వేతనంతో కూడిన సెలవు కావడం విశేషం. కంపెనీ ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాల అనారోగ్య సమస్య ఉండి, చికిత్స నిమిత్తం ఈ సెలవులు పొందవచ్చని, వ్యక్తిగత ఇష్టాలు, లక్ష్యాలను సాధించేందుకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఒకవేళ కంపెనీ ఉద్యోగికే ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే తీసుకున్న సెలవు కాలానికి మొత్తం వేతనాన్ని కంపెనీ చెల్లించనుంది. ఇంటి సభ్యుల కోసం సెలవు తీసుకుంటే మాత్రం మూడు నెలల వరకు 25 శాతం వేతనాన్ని ఇవ్వనున్నారు.
అంతేకాకుండా, ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్, బీమా, అదనపు వైద్య ప్రయోజనాలు, సహకారం వంటి ఇతర ముఖ్యమైన ప్రయోజనాలను కూడా పొందనున్నారు. అనారోగ్యం కాకుండా ఇతర కారణాలతో సెలవు తీసుకుంటే ఆ కాలానికి జీతం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ శ్రేయస్సు లక్ష్యంగా తీసుకొచ్చాం. ఈ కొత్త విధానం ఉద్యోగుల అవసరాలకు ఉపయోగపడుతుందని మీషో హెచ్ఆర్ ఆశిష్ కుమార్ సింగ్ చెప్పారు. కాగా, ప్రస్తుతం కంపెనీ 2,000 మంది వరకు ఉద్యోగులను కలిగి ఉంది. గతేడాదిలోనే మీషో కంపెనీ విలువ పరంగా యూనికార్న్ హోదాను సాధించింది.