Flash: ఎమ్ఎస్ స్వామినాథన్ ఇంట తీవ్ర విషాదం
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్వామినాథన్ సతీమణి మీనా స్వామినాథన్(88) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడించారు. శిశు విద్యా రంగంలో నిపుణురాలు అయిన ఆమె, లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ చైర్మెన్‌గా కూడా మీనా ఉన్నారు. టీచర్‌గా, ఎడ్యుకేటర్‌గా, రైటర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. చిన్నపిల్లల విద్యకు సంబంధించి అనేక పుస్తకాలు రాశారు. కాగా, ఆమె మరణవార్త తెలిసిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళి అర్పించారు.