Vishwak Sen: రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిన ‘మెకానిక్ రాకీ’.. రెండో ట్రైలర్ అప్‌డేట్ కూడా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky).

Update: 2024-11-16 08:32 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). కమర్షియల్ ఎంటర్‌టైన్‌గా రూపొందుతున్న ఈ సినిమాను రామ్ తాళ్లూరి (Ram Talluri) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ (trailer), ఫస్ట్ సింగిల్‌కు కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

ఈ క్రమంలో ప్రజెంట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event)కు సిద్ధం అయింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రాండ్ ఈవెంట్‌ను వరంగల్ (Warangal)లోని జెఎన్ఎస్‌డబ్ల్యూ ఇండోర్ స్టేడియం (JNSW Indoor Stadium)లో నిర్వహించనున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ‘మెకానిక్ రాకీ’ సెకండ్ ట్రైలర్ (Second Trailer) 2.0 ను కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. కాగా.. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Sraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Read More...

Matka Movie: ‘మట్కా’ మూవీకి అంత హైప్ క్రియోట్ చేశారు.. మొదటి రోజు ఇంతేనా కలెక్ట్ చేసింది?


Tags:    

Similar News