గర్ల్‌ఫ్రెండ్‌కు వార్నింగ్ మెసేజ్.. 5 నిమిషాల డెడ్‌లైన్
యంగ్ జనరేషన్ లవర్స్ మధ్య పొసెసివ్‌నెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువే. డిజిటల్ జిందగీలో తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను..latest telugu news
దిశ, ఫీచర్స్ : యంగ్ జనరేషన్ లవర్స్ మధ్య పొసెసివ్‌నెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువే. డిజిటల్ జిందగీలో తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎప్పుడు ఎవరు ఎగరేసుకుపోతారన్న భయం సహజం. అందుకే వారిపై అనవసర రిస్ట్రిక్షన్స్ విధిస్తుంటారు. ఇక తమ లవర్స్ ఎవరైనా అబ్బాయి పోస్టుకు లైక్, కామెంట్ చేస్తే ఆ జెలసీని తట్టుకోలేక పోతుంటారు. ఈ శ్రుతిమించిన వ్యవహారం కంటిన్యూ అయితే చివరకు బ్రేకప్ గ్యారంటీ. ఈ క్రమంలోనే టిక్ టాకర్ యూజర్ @hteesheee తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసిన సెల్ఫీకి బాయ్‌ఫ్రెండ్ నుంచి వార్నింగ్ మెసేజ్ అందుకుంది.
'మరో ఐదు నిమిషాల్లో(1.40) ఫొటో డిలీట్ చేయకపోతే బ్రేకప్ చెప్పేస్తా' అని మెసేజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్.. దీనికి కొనసాగింపుగా 5 మినిట్ కౌంట్‌డౌన్‌తో టైమర్ కూడా పంపించాడు. ఆ టైమ్ ముగిసినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 'టైమ్ అప్. నీకు మంచి జీవితం ఉంది. ఇకపై నువ్వు నాకు భారం కానవసరం లేదు. నీకు నచ్చింది చేసుకోవచ్చు' అని మరో మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. ఇక ఈ స్క్రీన్ షాట్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ 'హ్యాపీనెస్ డ్రామాటిక్‌గా ఉంటుందంటారు. అదెలాగో నేను ఇప్పుడు డీల్ చేయబోతున్నా' అంటూ సంతోషపడింది.