Mamata Banerjee: జుబైర్ అరెస్టును ఖండించిన మమతా బెనర్జీ

Mamata Banerjee Attacks Centre Over Arrest of Alt News Co-Founder Mohammed Zubair | ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా పలువురు స్పందించారు. బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించి ఫేక్ వీడియోలు

Update: 2022-06-28 11:20 GMT

న్యూఢిల్లీ: Mamata Banerjee Attacks Centre Over Arrest of Alt News Co-Founder Mohammed Zubair| ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహ్మద్ జుబైర్ ను అరెస్ట్ చేయడంపై దేశవ్యాప్తంగా పలువురు స్పందించారు. బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించి ఫేక్ వీడియోలు, ప్రజలను మోసగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కాషాయ నేతలు చెత్త సమాచారాన్ని ప్రచారాన్ని ఇతరులను నిందిస్తున్న వారిని అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడేవారిని మాత్రం లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. జర్నలిస్ట్ జుబైర్, సామాజిక కార్యకర్త తీస్తా సితల్వాడ్ ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రపంచమంతా వారి అరెస్టును ఖండిస్తోందని అన్నారు. జర్నలిస్టు జుబైర్ అరెస్టును ఎడిట‌ర్స్ గిల్డ్ ఖండించింది. అతన్ని వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్ చేసింది. న‌కిలీ వార్త‌ల‌ను గుర్తించ‌డంలో ఆల్ట్‌న్యూస్ నిష్పక్షపాతంగా ప‌నిచేసింద‌ని ఎడిట‌ర్స్ గిల్డ్ పేర్కొంది.

వారం రోజుల ముందే కేసు నమోదు..

ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ జుబైర్‌పై వారం రోజుల కిందటే కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ట్విట్టర్ పోస్టు చేశారనే ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 'మహ్మద్ జుబైర్ యొక్క పోస్ట్ ఒక నిర్దిష్ట మత సమాజానికి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ చాలా రెచ్చగొట్టేదిగా ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేయబడుతుంది. ఇది ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడంతో పాటు, ప్రశాంతతను కాపాడుకోవడానికి హానికరం' అని తెలిపారు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్ షేర్ చేస్తూ అభ్యంతరకర పదాలు ఉపయోగించారని మహ్మద్ జుబైర్‌పై ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News