Rama Rao On Duty: సినిమా రిలీజ్‌కు ముందు రవితేజకు గట్టి షాక్.. వీడియో లీక్
Leaked Video Clip From Ravi Teja Starrer Rama Rao On Duty Movie| మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న తరుణంలో మాస్ మహారాజ్ రవితేజకు ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాలతో రేపు(29-07-2022) విడుదల కానున్న 'రామారావు ఆన్‌డ్యూటీ' చిత్రానికి లీకేజీ దెబ్బ పడింది
దిశ, వెబ్‌డెస్క్: Leaked Video Clip From Ravi Teja Starrer Rama Rao On Duty Movie| మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న తరుణంలో మాస్ మహారాజ్ రవితేజకు ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాలతో రేపు(29-07-2022) విడుదల కానున్న 'రామారావు ఆన్‌డ్యూటీ' చిత్రానికి లీకేజీ దెబ్బ పడింది. ఈ సినిమా నుంచి కీలక సీన్‌లు లీక్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కు ఒక్కరోజు ముందే లీక్ అవ్వడం మూవీ టీంకు పెద్ద దెబ్బగా మారింది. సినిమాలో రవితేజ పొలిటికల్ డైలాగ్‌లు చెబుతున్న వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో రవితేజ అభిమానులు షాక్‌లో ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమాకు లీకేజ్ దెబ్బ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇలా సినిమాలను రిలీజ్‌కు ముందే లీక్ చేసేవారికి వదలకూడదంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. శరత్ మండవ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టు జులై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కూడా హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, 'సర్పట్ట' జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.
ఇది కూడా చదవండి: డిజాస్టర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న భామ