లాహోర్ : పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టీ20 ఫైనల్ మ్యాచ్‌లో లాహోర్ ఖలాండర్స్ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లాహోర్ జట్టు ముల్తాన్ సుల్తాన్ జట్టుపై 42 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 180/5 పరుగులు చేయగా.. ఛేజింగ్‌లో ముల్తాన్ సుల్తాన్ జట్టు వెనుకబడింది. 138/10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.పీఎస్ఎల్ ఏడో ఎడిషన్ గెలిచిన తర్వాత లాహోర్ ఖలాండర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 'ఈ క్షణం కోసం మేము ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నాం.. చాలా మంది నాకు మద్దతు ఇచ్చారు. టోర్నమెంట్ మొత్తంలో మేము జట్టుగా చూపిన పోరాటం నిజంగా అద్భుతమైనది' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఖలాండర్స్ జట్టు తొలిసారి పీఎస్ఎల్ టైటిల్‌ను అందుకుంది.