ఫేవరెట్ యాంగిల్స్‌ చూపించిన నటి.. (వీడియో)

దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి సనన్ తనకు ఇష్టమైన వర్కౌట్స్ గురించి ఓపెన్ అయింది. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులోనూ ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే..Latest Telugu News

Update: 2022-06-21 09:40 GMT

దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి సనన్ తనకు ఇష్టమైన వర్కౌట్స్ గురించి ఓపెన్ అయింది. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులోనూ ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాను కూడా ఆ కోవకే చెందుతానంటున్న కృతి.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది.

'నేను ఇష్టపడే వ్యాయామాలు! బహుశా నేను వాటిని బాగా చేయడం వల్లే కావచ్చు' అంటూ క్యాప్షన్ ఇచ్చిన నటి.. స్ట్రెయిట్ ఆర్మ్ పుల్‌ఓవర్‌, హాలో స్వింగ్‌, రష్యన్ ట్విస్ట్‌, సింగిల్ లెగ్ హామ్‌స్ట్రింగ్ బ్రిడ్జ్, బోసు ప్లాంక్ రెయిన్‌బోస్ చేసి చూపించడం విశేషం. ఇక తన కమిట్‌మెంట్, హార్డ్ వర్క్‌కు ఫిదా అయ్యామంటున్న నెటిజన్లు.. 'మీరు స్క్వాట్ చేయడం చూడాలనుకుంటున్నాం' అంటూ తమ ఇష్టాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఆమె.. 'IIFA 2022'లో ఉత్తమ నటి అవార్డ్ గెలుచుకున్న విషయం తెలిసిందే.


Similar News