నా లైఫ్లో మోస్ట్ క్రేజీయెస్ట్ పర్సన్ అతడే.. కియారా అద్వానీ
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో దూసుకుపోతోంది..Latest Telugu News
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో దూసుకుపోతోంది. ఇటీవల తను నటించిన 'భూల్ భూలయ్యా 2', 'జుగ్ జుగ్ జీయో' భారీ వసూలు రాబడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా ఓ సమావేశంలో పాల్గొన్న నటిని.. 'మీరు ఇప్పటి వరకూ కలుసుకున్న అత్యంత క్రేజీ పర్సన్ ఎవరు?' అనే ప్రశ్నకు బదులిస్తూ ఓ వింత అనుభవాన్ని పంచుకుంది. 'ఒక అభిమాని నా కోసం పిచ్చిపని చేశాడు.
నేను ఓ అపార్ట్మెంట్లో పైన ఫ్లోర్లో ఉన్నాను. ఆయన నన్ను కలవడానికి మెట్లెక్కి పైకి వచ్చాడు. దీంతో చెమటలు పట్టి పూర్తిగా నీరసించిపోయాడు. అతన్ని చూడగానే షాక్ అయ్యాను. వెంటనే తేరుకుని ఏమైంది? బాగున్నారా? కూర్చోండి అంటూ నీరు అందిచాను' అని చెప్పుకొచ్చింది. ఇక ఆ అబ్బాయి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక తనంటే ఎంత ఇష్టమో వివరించాడన్న యాక్ట్రెస్.. తనపై చూపించిన అభిమానానికి సంతోషించినప్పటికీ, ఇలాంటి భయానకమైన పనులు చేయొద్దని రిక్వెస్ట్ చేసినట్లు తెలిపింది. చివరగా ఆయన సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం కాదని స్పష్టం చేసింది.