పార్టీ విధానాలు నచ్చకుంటే తప్పుకోవాలి: టీఆర్ఎస్ బెల్లం వేణుగోపాల్

దిశ, నేలకొండపల్లి: పార్టీ విధానాలు - Khammam TRS president Bellam Venugopal should quit if he does not like party policies

Update: 2022-03-17 12:02 GMT

దిశ, నేలకొండపల్లి: పార్టీ విధానాలు నచ్చకుంటే గౌరవంగా తప్పుకోవాలని, ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని ఖమ్మం గ్రామీణ టీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవీ భవన్లో జరిగిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తుమ్మల పర్యటనలో కార్యకర్తలతో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మల కార్యకర్తలను నిందించారని ఆరోపించారు.


ఆయన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను విమర్శించడం తగదని హితవు పలికారు. తుమ్మల తన సొంత మండలంలోని సొంత గ్రామాల్లో మెజారిటీని తెప్పించలేకపోయారని ఈ సందర్భంగా వివరించారు. అందుకు తగిన సాక్షాల ప్రతులను విలేకరులకు ఆయన అందించారు. దీనిని బట్టి నిజమైన రాజకీయ ద్రోహి ఆయనేనని వేణు తెలిపారు.

అనంతరం నేలకొండపల్లి మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సభలో తుమ్మల కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తుమ్మల ఓడించినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలను పిచ్చి కుక్కలు కూడా ముట్టవని అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తుమ్మల తన వైఖరి, నోటి దురుసు తనంతోనే ఓడిపోయారని పేర్కొన్నారు. నాయకులుగాని, కార్యకర్తలు గాని ఆయన ఓటమి కోసం పని చేయలేదని టీఆర్ఎస్ గెలుపు కోసమే పని చేశామని అన్నారు.


పార్టీ అనుమతి లేకుండా నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇతర మండలాల నుంచి ప్రజలను సమీకరించి ప్రదర్శనలు నిర్వహించి ఇక్కడే కార్యకర్తలను అయోమయంలోకి పడేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణ, తిరుమలాయపాలెం మండల ఎంపీపీలు శ్రీనివాస్, రమ్య, ఉమ, కూసుమంచి జడ్పీటీసీ ఇంటూరి శేఖర్ బేబీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వీరన్న, వీరయ్య ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News